![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు Illu illalu pillalu. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ 564 లో.....రైస్ మిల్లులో పోయిన ఆరు లక్షల రూపాయల గురించి ఆలోచిస్తూ చందూ రాత్రంతా నిద్ర లేకుండా టెన్షన్ పడుతుంటాడు. అదే అదునుగా చూసుకున్న వల్లి, చందూ మనసులో తిరుపతి మీద అనుమానం కలిగేలా మాట్లాడుతుంది. బా.. నీ ఆరోగ్యం పాడు చేసుకోకు.. చెయ్యని తప్పుకు రేపు మీ నాన్న ముందు దోషిగా నిలబడితే నేను చూడలేనని వల్లి కేరింగ్ నటిస్తూనే.. లోపల డబ్బులు కొట్టేసింది మీ తిరుపతి మావయ్యే బా.. నిజంగా దొంగలు పడితే అంత డబ్బులో కేవలం ఆరు లక్షలు మాత్రమే ఎందుకు తీసుకెళ్తారని నూరిపోస్తుంది. ఇంకోసారి మా తిరుపతి మావయ్య గురించి మాట్లాడావంటే నీ చెంపలు వాయించేస్తానని వల్లిని తిడతాడు చందు.
చందూ ఎంత కోప్పడినా వల్లి తగ్గదు. తన మాటలు చందూ మనసులో అనుమానపు బీజాన్ని నాటాయని గ్రహించి ప్రశాంతంగా నిద్రపోతుంది. తిట్టగా తిట్టగా ఒక తిట్టు, వేయగా వేయగా ఒక రాయి తగులుతాయి అంటారు. నా మాటలు చందూకి తగిలాయి. ఇక నేను అనుకున్న ప్లాన్ నడిస్తే ఆ డబ్బుల విషయంలో మేం సచ్చినా దొరకం అని తనలో తను మురిసిపోతుంది వల్లి.
మరోవైపు ప్రేమ, ధీరజ్ ల మధ్య మరోసారి తీవ్రమైన మాటల యుద్ధం మొదలవుతుంది. ముందు రాయి విసిరింది నువ్వే, నాటకాలు ఆడవంటే పసుపు దంచినట్లు దంచుతానని ప్రేమ ఫైర్ అవ్వగానే ఏయ్ తింగరిదానా.. నేను రాయి విసరడం ఏంటని ధీరజ్ తన మీదకు వెళ్తాడు. ఇద్దరూ చేతిలో రాళ్లతో ఒకరినొకరు కొట్టుకోవడానికి సిద్ధపడటంతో మిగతా వాళ్లు భయపడి వాళ్లను ఆపడానికి పరుగెత్తుకుంటూ వస్తారు. మరుసటి రోజు ఉదయాన్నే .. చందూ, సాగర్, ధీరజ్ ముగ్గురు కలిసి నిద్రపోతున్న తిరుపతిని చాపతో సహా మోసుకెళ్లి కింద పడేస్తారు. తర్వాత నీళ్లు గుమ్మరించి.. హ్యాపీ బర్త్ డే తిరుపతి మావా అని అరుస్తారు. దానికి తిరుపతి కంగారుగా లేచి.. ఎవరైనా బర్త్ డే విషెస్ ని పూలు చల్లో, పన్నీరు చల్లో చెప్తారు గానీ ఇలా నీళ్లు పోసి చెప్తారా అని అంటాడు. మా మావ మీద ఎంత ప్రేమ ఉందో తెలియడానికే ఇలా చేశామని ధీరజ్ ఆటపట్టిస్తాడు. ఆ తర్వాత ఆ ముగ్గురు తిరుపతిని పెళ్లికొడుకులా ముస్తాబు చేస్తారు. మావా.. అచ్చం పెళ్లికొడుకులా ఉన్నావని చందూ అనగానే ఊరంతా కూడా ఇదే టాక్ రా మావా.. జీవితాంతం నీకు పెళ్లి కాదని అని సాగర్ కౌంటర్ వేయడంతో తిరుపతి వాళ్లను పట్టుకోవడానికి ఇల్లంతా పరుగులు తీస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |